Chandrababu: చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేస్తూ జడ్జి పేర్కొన్న అంశాలు ఇవే!

Judge mentions some points during the hearing on Chandrababu petition
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు హైకోర్టులో తీవ్ర నిరాశ కలిగిన సంగతి తెలిసిందే. స్కిల్ స్కాం కేసుకు సంబంధించి ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి కొన్ని అంశాలను ప్రస్తావించారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో 140 మంది సాక్షులను విచారించారని, 4 వేల కాపీలను అందజేశారని వెల్లడించారు. ఈ సమయంలో పోలీసుల విచారణలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేశారు. ఈ దశలో క్వాష్ పిటిషన్ పై నిర్ణయం తీసుకోలేమని తెలిపారు. ఈ సందర్భంగా నీహారిక వర్సెస్ మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలను న్యాయమూర్తి ఉదహరించారు.
Go Back to Shorts
Chandrababu
Quash Petition
AP High Court
Skill Case
AP CID

More Telugu News