Vishal: నా ఫేవరెట్ పొలిటీషియన్ జగన్ అంటూనే.. చంద్రబాబు అరెస్ట్ పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన హీరో విశాల్

Jagan is my favourite politician but Chandrababu arrest is not proper says Actor Vishal
  • చంద్రబాబు అరెస్ట్ విషయంలో మరింత లోతుగా ఆలోచించి ఉండాల్సిందన్న విశాల్
  • పక్కాగా ఆధారాలను సేకరించిన తర్వాత వెళ్తే బాగుండేదని వ్యాఖ్య
  • ఒక సామాన్య వ్యక్తిగా ఇదే తన అభిప్రాయమని స్పష్టీకరణ
టీడీపీ అధినేత చంద్రబాబు గొప్ప నాయకుడని, ఆయనను అరెస్ట్ చేయడం బాధాకరమని సినీ హీరో విశాల్ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. చంద్రబాబును అరెస్ట్ చేయడాన్ని చూసి చాలా భయమేసిందని ఆయన చెప్పారు. చంద్రబాబులాంటి వ్యక్తికే ఇలాంటి పరిస్థితి వస్తే... తనలాంటి సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా ఇదే అంశంపై విశాల్ మరోసారి స్పందించారు. 

చంద్రబాబు అరెస్ట్ విషయంలో ఏపీ ప్రభుత్వం లోతుగా ఆలోచించి ఉండాల్సిందని విశాల్ అన్నారు. తన అభిమాన రాజకీయ నాయకుడు జగనేనని... అయినప్పటికీ చంద్రబాబు అరెస్ట్ విషయంలో మాత్రం తాను ఆవేదనకు గురవుతున్నానని చెప్పారు. చంద్రబాబును అరెస్ట్ చేసే ముందు ఏపీ సీఐడీ పోలీసులు మరింత లోతుగా ఆలోచించాల్సిందని, పక్కాగా ఆధారాలను సేకరించిన తర్వాత వెళ్లి ఉంటే బాగుండేదని అన్నారు. తాను ఈ వ్యాఖ్యలను సినీ నటుడిగా చేయడం లేదని, ఒక సామాన్య వ్యక్తిగా తన అభిప్రాయం ఇదేనని స్పష్టం చేశారు.
Vishal
Tollywood
Chandrababu
Telugudesam
Arrest
Jagan
YSRCP

More Telugu News