AP Assembly Session: ఏపీ అసెంబ్లీలో తీవ్ర గందరగోళం.. 15 నిమిషాల్లోనే సభ వాయిదా

AP Assembly adjourned in just 15 minutes
  • సభ ప్రారంభమైన వెంటనే టీడీపీ సభ్యుల ఆందోళన
  • చంద్రబాబు అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ నిరసన
  • స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన టీడీపీ సభ్యులు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు యుద్ధరంగాన్ని తలపిస్తున్నాయి. ఈరోజు సభ ప్రారంభమైన వెంటనే చంద్రబాబు అరెస్ట్ పై టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ప్లకార్డులు చేతపట్టి, స్పీకర్ పోడియంను చుట్టు ముట్టారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ పై తాము ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చర్చకు స్వీకరించాలని పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో టీడీపీ సభ్యులపై స్పీకర్ తమ్మినేని, మంత్రి బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా ఏమాత్రం తగ్గని టీడీపీ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ఆందోళనను కొనసాగించారు. ఎవరి సీట్లలో వారు కూర్చోవాలని స్పీకర్ పదేపదే చెప్పినా వారు పట్టించుకోలేదు. దీంతో, సభను స్పీకర్ 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. ఈ క్రమంలో సభ ప్రారంభమైన 15 నిమిషాలకే వాయిదా పడింది.
AP Assembly Session
Adjourn

More Telugu News