Ambati Rambabu: బాలకృష్ణకు ఎక్స్ వేదికగా అంబటి రాంబాబు కౌంటర్

Ambati Rambabu counter to Balakrishna
  • ఏపీ అసెంబ్లీలో మీసం మెలేసిన టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ
  • ఎక్స్ వేదికగా అంబటి రాంబాబు విమర్శలు
  • బ్లడ్, బ్రీడ్ వేరని మీసం తిప్పితే ఊరుకోవడానికి ఇక్కడ ఉన్నది కాపు బిడ్డ.. నాది తెలుగు గడ్డ అంటూ చురకలు
టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై మంత్రి అంబటి రాంబాబు ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బాలకృష్ణ మీసం మెలేసిన విషయం తెలిసిందే. వర్షాకాల సమావేశాల మొదటిరోజు వైసీపీ, టీడీపీ మధ్య సభలో వాగ్వాదం జరిగింది. చంద్రబాబు అరెస్ట్‌పై చర్చించాలని టీడీపీ పట్టుబట్టింది. బీఏసీలో చర్చించాక నిర్ణయం తీసుకుంటామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు.

ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ  సభ్యుల మధ్య మాటలయుద్ధం జరిగింది. ఓ సమయంలో బాలకృష్ణ మీసం మెలేసి సవాల్ చేయగా, మంత్రి అంబటి అప్పుడే కౌంటర్ ఇచ్చారు. ఈ మీసాలు తిప్పడం సినిమాల్లో చేసుకోవాలన్నారు.

అయితే సభలో బాలకృష్ణ మీసాలు తిప్పడంపై ఆ తర్వాత అంబటి రాంబాబు ఎక్స్ వేదికగా కూడా స్పందించారు. తన బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు అని మీసం తిప్పితే ఊరుకోడానికి ఇక్కడ ఉన్నది కాపు బిడ్డ! నాది తెలుగు గడ్డ! అంటూ ట్వీట్ చేశారు.
Ambati Rambabu
Balakrishna
Telugudesam
YSRCP

More Telugu News