Krithi Shetty: శర్వానంద్ జోడీగా సందడి చేయనున్న కృతి శెట్టి!

  • వరుస ఫ్లాపులతో వెనకబడిన కృతి
  • తమిళ .. మలయాళ సినిమాలపై దృష్టి 
  • శర్వానంద్ సినిమాలో దక్కిన ఛాన్స్ 
  • ముగింపు దశలో ఉన్న చిత్రీకరణ   
Krithi Shetty Special

కృతి శెట్టిని 'ఉప్పెన' సినిమాలో చూసిన వాళ్లంతా, ఈ మధ్య కాలంలో ఇంత అందమైన అమ్మాయి హీరోయిన్ గా రాలేదని చెప్పుకున్నారు. ఆకర్షణీయమైన కళ్లు .. అందమైన నవ్వు చూసి ఆమె అభిమానుల జాబితాలో కుర్రాళ్లంతా చేరిపోయారు. అందుకు తగినట్టుగానే కృతికి హ్యాట్రిక్ హిట్ దొరికింది. దాంతో ఇక ఈ బ్యూటీని పట్టుకోవడం కష్టమని అంతా భావించారు.

అయితే దురదృష్టవశాత్తు ఆ తరువాత వరుసగా నాలుగు సినిమాలు పరాజయం పాలయ్యాయి. క్రేజ్ ఉన్న హీరోలతో చేసినప్పటికీ, పెద్ద బ్యానరుల్లో వచ్చిన సినిమాలే అయినప్పటికీ ఆమె పరాజయాల బారి నుంచి తప్పించుకోలేకపోయింది. తెలుగు నుంచి అవకాశాలు లేకపోవడంతో తమిళ .. మలయాళ భాషలపై దృష్టి పెట్టింది. 

ఈ నేపథ్యంలో ఆమె శర్వానంద్ 35వ సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్టుగా ఒక టాక్ వినిపించింది. అయితే అధికారికంగా బయటికి రాలేదు. ఈ రోజున కృతి శెట్టి పుట్టినరోజు కావడంతో, ఆమెకి విషెస్ చెబుతూ, ఈ సినిమా టీమ్ పోస్టర్ ను వదిలింది. దాంతో శర్వా జోడీగా ఆమె చేస్తోందనే విషయంలో ఒక క్లారిటీ వచ్చింది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరువుకుందని అంటున్నారు. ఈ సినిమా ఫలితం కృతికి మాత్రమే కాదు .. శర్వాకి కూడా కీలకమే.  

More Telugu News