Nitrhya Menon: 'కుమారి శ్రీమతి' తెలుగు వెబ్ సిరీస్ తో వచ్చేస్తున్న నిత్యామీనన్!

  • నటిగా పేరు తెచ్చుకున్న నిత్యామీనన్
  • ప్రస్తుతం వెబ్ సిరీస్ లతోనూ బిజీ
  • అమెజాన్ లో రానున్న 'కుమారి శ్రీమతి'
  • ఈ నెల 28 నుంచి 7 ఎపిసోడ్స్ స్ట్రీమింగ్  
Kumari Srimathi Web Series Streaming Date Cinfirmed

తెరపై స్కిన్ షో చేయకుండా కేవలం నటన ద్వారా మాత్రమే ప్రేక్షకుల మనసులను దోచుకున్న కథానాయికలలో, సాయిపల్లవి కంటే ముందుగా వినిపించిన పేరు నిత్యామీనన్. యంగ్ హీరోలతో జోడీకడుతూ .. తనకి నచ్చిన పాత్రలను మాత్రమే చేస్తూ ముందుకు వెళ్లింది. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో క్రేజ్ ను దక్కించుకుంది.

ఇప్పుడు కూడా నిత్యామీనన్ కి రావలసిన అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అయితే పెరిగిన పోటీ కారణంగా మునుపటి కంటే అవకాశాలు తగ్గాయి. అందువలన ఆమె వెబ్ సిరీస్ ల దిశగా అడుగులు వేసింది. 'బ్రీత్' .. 'ఇన్ టు ద షాడోస్' .. 'మోడ్రన్ లవ్ హైదరాబాద్' అనే వెబ్ సిరీస్ లలో నటించింది. 

తాజాగా ఆమె 'కుమారి శ్రీమతి' అనే తెలుగు వెబ్ సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ ఈ నెల 28వ తేదీ నుంచి నాలుగు భాషల్లో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. గోమటేశ్ ఉపాధ్యాయ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్, 7 ఎపిసోడ్స్ గా స్ట్రీమింగ్ కానుంది. స్త్రీ వ్యక్తిత్వం .. వివాహం .. ఉద్యోగానికి సంబంధించిన అంశాలను కలుపుకుంటూ ఈ కథ సాగనున్నట్టుగా తెలుస్తోంది.

More Telugu News