Cricket: వచ్చే టీ20 వరల్డ్​ కప్‌నకు అమెరికా ఆతిథ్యం.. భారత్‌–పాక్​ మ్యాచ్​ ఎక్కడంటే..!

  • వెస్టిండీస్‌తో పాటు అమెరికాకు ఆతిథ్య హక్కులు కేటాయించిన ఐసీసీ
  • ఫ్లోరిడా, డల్లాస్, న్యూయార్క్‌లో జరగనున్న మ్యాచ్‌లు
  • న్యూయార్క్‌లోని ఐసన్ హోవర్ పార్క్ స్టేడియంలో దాయాదుల మ్యాచ్ జరిగే అవకాశం
ICC announces Dallas and Florida and New York as venues in USA for 2024 Mens T20 World Cup matches

  వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచ కప్‌నకు ఆమెరికా ఆతిథ్యం ఇవ్వనుంది. వెస్టిండీస్‌తో పాటు అమెరికాలోని మూడు నగరాల్లో ప్రపంచ కప్ మ్యాచులు నిర్వహించేందుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అంగీకరించింది. ఈ మేరకు న్యూయార్క్, డల్లాస్, ఫ్లోరిడాలో కొన్ని మ్యాచులు జరుగుతాయని అధికారికంగా వెల్లడించింది. బ్రోవార్డ్ కౌంటీ (ఫ్లోరిడా), గ్రాండ్ పైరీ (డల్లాస్), ఐసన్ హోవర్ పార్క్ (న్యూయార్క్) స్టేడియాల్లో తొలిసారి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచును నిర్వహించనున్నారు. టీ20 వరల్డ్ కప్ ఆతిథ్య హక్కులను వెస్టిండీస్‌తో పాటు తొలిసారి అమెరికాకు ఇచ్చామని ఐసీసీ వెల్లడించింది. 

వచ్చే ఏడాది జరిగే టోర్నీలో మొత్తం 20 జట్లు బరిలోకి దిగనున్నాయి. ఎక్కువ మంది ప్రేక్షకులు హాజరయ్యేలా ఫ్లోరిడా, డల్లాస్ క్రికెట్ స్టేడియాల సామర్థ్యం పెంచేందుకు ఐసీసీ కృషి చేయనుంది. న్యూయార్క్‌లోని ఐసన్ హోవర్ పార్క్ స్టేడియంలో భారత్–పాకిస్థాన్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. ఈ స్టేడియం కెపాసిటీని పెంచి 34 వేల సీట్లను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తామని ఐసీసీ వెల్లడించింది.

More Telugu News