AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. చంద్రబాబు అరెస్ట్ పై అట్టుడుకుతున్న సభ

  • అసెంబ్లీకి పాదయాత్రగా వెళ్లిన టీడీపీ సభ్యులు
  • సభలో ప్రశ్నోత్తరాలను చేపట్టిన స్పీకర్
  • చంద్రబాబు అరెస్ట్ పై వాయిదా తీర్మానానికి పట్టుబడుతున్న టీడీపీ సభ్యులు
AP Assembly sessions started

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలకు టీడీపీ శాసనసభ, శాసనమండలి సభ్యులు పాదయాత్రగా వెళ్లారు. తొలుత వెంకటాయపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి వారు నివాళి అర్పించారు. అనంతరం సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి శాసనసభ వరకు పాదయాత్రగా వెళ్లారు. చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రి జగన్, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీరి పాదయాత్రలో వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి కూడా పాల్గొన్నారు. 


మరోవైపు, అసెంబ్లీలో స్పీకర్ తమ్మినేని ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే, చంద్రబాబు అక్రమ అరెస్ట్ పై వాయిదా తీర్మానానికి టీడీపీ సభ్యులు పట్టుబడుతున్నారు. సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. ఈ క్రమంలో అధికార, విపక్ష సభ్యుల అరుపులతో సభ అట్టుడుకుతోంది. టీడీపీ సభ్యుల ఆందోళనల మధ్యే సభ కొనసాగుతోంది.

More Telugu News