West Bengal: కేరళ దాటిన నీపా వైరస్.. పశ్చిమ బెంగాల్‌లోకి ఎంట్రీ?

  • కేరళ నుంచి సొంతూరికి తిరిగొచ్చిన పశ్చిమబెంగాల్ యువకుడిలో నిపా వైరస్ లక్షణాలు
  • నీపా వైరస్ టెస్టులు ఇంకా జరపాల్సి ఉందని చెప్పిన యువకుడి కుటుంబసభ్యులు
  • కేరళలో ఉండగానే  తీవ్ర జ్వరంతో ఆసుపత్రి పాలైన యువకుడు
  • జ్వరం తగ్గాక డిశ్చార్జ్, సొంతరాష్ట్రం చేరుకున్న రెండు రోజులకే తిరగబెట్టిన అనారోగ్యం
Bengal Man Who Returned from Kerala Admitted to Kolkata Hospital with Nipah Symptoms

కేరళ నుంచి స్వరాష్ట్రానికి తిరిగెళ్లిన పశ్చిమబెంగాల్ యువకుడిలో నిపా వైరస్ తరహా లక్షణాలు బయటపడటం సంచలనంగా మారింది. నిపా వైరస్ పశ్చిమబెంగాల్‌లో కాలుపెట్టిందా? అన్న భయాలు వ్యక్తమవుతున్నాయి. బుర్ద్వాన్ జిల్లాకు చెందిన యువకుడు పొట్టకూటికోసం కేరళకు వలస వెళ్లాడు. ఇటీవలే తిరిగొచ్చిన అతడు తీవ్ర జ్వరం, కడుపులో తిప్పడం, గొంతు‌లో ఇన్ఫెక్షన్‌ బారినపడటంతో కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే, నిపా వైరస్ నిర్ధారించేందుకు పరీక్షలు నిర్వహించాల్సి ఉందని కుటుంబసభ్యులు తెలిపారు. నీపా కేసులు అధికంగా ఉన్న కేరళ వచ్చిన యువకుడి విషయంలో చాలా అప్రమత్తంగా ఉంటున్నామని ప్రభుత్వ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. 

కేరళలో ఉండగానే అతడు తీవ్ర జ్వరంతో బాధపడ్డాడని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. స్థానిక ఆసుపత్రిలో కొంత కాలం చికిత్స తరువాత యువకుడికి జ్వరం తగ్గడంతో డిశ్చార్జ్ అయినట్టు పేర్కొన్నారు. ఆ తరువాత పశ్చిమ బెంగాల్‌కు తిరిగొచ్చిన రెండు రోజులకే బాధితుడు అనారోగ్యం పాలయ్యాడని చెప్పారు. తొలుత అతడిని నేషనల్ మేడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌కు తరలించారని, ఆ తరువాత బెలియఘాటా ఐడీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని పేర్కన్నారు.

More Telugu News