Justin Trudeau: భారత్‌తో వివాదం.. కెనడాకు నిప్పుతో చెలగాటమే!: అంతర్జాతీయ నిపుణులు

  • భారత్‌పై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలతో అంతర్జాతీయంగా ఆందోళన 
  • ట్రూడోపై అమెరికా నిపుణుల విమర్శలు
  • భారత్‌తో వివాదం నిప్పుతో చెలగాటమని వ్యాఖ్య
  • ఈ వివాదంలో అమెరికా జోక్యం చేసుకోకూడదని సూచన
Experts warn canada PM against entering fued with india

కెనడాలో ఖలిస్థానీ మద్దతుదారుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉండొచ్చంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య పెను దూమారం రేపాయి. ఈ ఆరోపణలపై అంతర్జాతీయంగా కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వివాదంపై అమెరికా మేధోమధన సంస్థ హడ్సన్ ఇన్‌స్టిట్యూట్ వేదికగా అంత్జాతీయ వ్యవహారాల నిపుణుల చర్చ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న నిపుణులు కెనడా తీరును దుయ్యబట్టారు. 

ఖలిస్థానీ ఉద్యమాన్ని లాభార్జనగా చూస్తున్న కొంత మంది చేతుల్లో ట్రూడో కీలుబొమ్మగా మారారని ఈ కార్యక్రమంలో నిపుణులు మండిపడ్డారు. ఖలిస్థానీ నేత హత్యను భారత నిఘావర్గాలకు అంటగడుతూ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని అన్నారు. ఇది ట్రూడోకు దీర్ఘకాలిక రాజకీయ ప్రయోజనాలు చేకూర్చినా నాయకత్వ లక్షణం మాత్రం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదంలో అమెరికా జోక్యం చేసుకోరాదని తాము భావిస్తున్నామని తెలిపారు. కెనడా నిప్పుతో చెలగాటమాడుతోందని వ్యాఖ్యానించారు.   

ఇక తాజా వివాదంతో అమెరికా పెద్ద ఇరకాటంలో పడింది. సన్నిహిత మిత్రదేశమైన కెనడా ఓవైపు, వ్యూహాత్మక భాగస్వామి భారత్ మరోవైపు ఉండటం అమెరికాకు తలనొప్పిగా మారింది.

More Telugu News