Chandrababu: చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై వాదనలు పూర్తి.. రేపు ఉదయం తీర్పు

Chandrababu custody petition ACB court will decide tomorrow
  • సీఐడీ తరఫున వాదనలు వినిపించిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి
  • చంద్రబాబు తరఫున వాదనలు వినిపించిన సిద్దార్థ లూద్రా
  • వాడీవేడిగా సుదీర్ఘ వాదనలు
టీడీపీ అధినేత చంద్రబాబు కస్టడీని కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్‌పై బుధవారం వాడీవేడిగా వాదనలు జరిగాయి. సీఐడీ తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి, చంద్రబాబు తరఫున సిద్ధార్థ లూద్రా వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న ఏసీబీ న్యాయస్థానం రేపు ఉదయం గం.11.30కు తీర్పు వెలువరిస్తానని తెలిపింది.

చంద్రబాబును పూర్తి ఆధారాలతో అరెస్ట్ చేశామని, ఆయనను విచారించడం కోసం ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ వాదనలు వినిపించింది. అయితే ఆయనను సిట్ కార్యాలయంలోనే విచారించారని, అసలు ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారని, కాబట్టి కస్టడీ పిటిషన్‌ను తిరస్కరించాలని సిద్ధార్థ లూద్రా కోర్టును కోరారు.
Chandrababu
cid
acb
Andhra Pradesh

More Telugu News