Hema Malini: ఇప్పుడు మా సంఖ్య 81.. త్వరలో 181 అవుతుంది: మహిళా రిజర్వేషన్ బిల్లుపై హేమమాలిని వ్యాఖ్య

  • మహిళా రిజర్వేషన్ బిల్లుకు తన మద్దతు ప్రకటించిన బీజేపీ ఎంపీ హేమమాలిని
  • బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టిన రోజు చరిత్రలో నిలిచిపోతుందని వ్యాఖ్య
  • మహిళలు మరింత పెద్ద సంఖ్యలో ప్రజాజీవితంలోకి రావాలని పిలుపు 
MP Hema malini extends support to women reservation bill

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రం లోక్ సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ పేరిట ఈ బిల్లును న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ ఎంపీల ముందుంచారు. ఈ సందర్భంగా బిల్లుకు తాను మద్దతు ఇస్తున్నట్టు బీజేపీ ఎంపీ హేమమాలిని తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటు ముందుకొచ్చిన ఈ రోజు చారిత్రక ప్రాధాన్యత సంతరించుకుందని ఆమె వ్యాఖ్యానించారు. 

‘‘మహిళల కోసం తీసుకున్న ఈ గొప్ప నిర్ణయంతో సెప్టెంబర్ 19 చారిత్రాత్మక రోజుగా మారింది. నూతన పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఈ మొదటి బిల్లు త్వరలో సభ్యుల ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నాం. ప్రస్తుతం 81 మంది మహిళా ఎంపీలు ఉన్నారు. ఈ బిల్లు తర్వాత మా సంఖ్య 181 అవుతుంది. దీంతో, మహిళా ప్రాతినిధ్యం పెరుగుతుంది. మహిళలకు ఆకాశమే హద్దు. కాబట్టి మరింత ఉత్సాహంతో ప్రజా జీవితంలో పని చేసేందుకు వారు ముందుకు రావాలి’’ అని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.

More Telugu News