Mekapati Chandramohan Reddy: ఎన్నికలు న్యాయంగా జరిగితే చంద్రబాబే సీఎం: మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి

  • ఓటమి భయంతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారన్న మేకపాటి
  • అరెస్ట్ తో వైసీపీ రాజకీయంగా నేలమట్టమయిందని వ్యాఖ్య
  • జగన్ కు ఓటమి భయం పట్టుకుందన్న మేకపాటి
If elections will be conducted properly Chandrababu will become CM says Mekapari

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును అడ్డం పెట్టుకుని, స్వార్థం కోసం జగన్ సీఎం అయ్యారని మండిపడ్డారు. జగన్ కు ఓటమి భయం పట్టుకుందని, ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతోనే చంద్రబాబును అరెస్ట్ చేశారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అరెస్ట్ వల్ల జగన్ కే నష్టమని... టీడీపీకి లాభమేనని చెప్పారు. ఎన్నికలను న్యాయంగా నిర్వహిస్తే గెలిచేది టీడీపీనే అని, చంద్రబాబే సీఎం అని అన్నారు. చంద్రబాబు అరెస్ట్ తో వైసీపీ రాజకీయంగా నేలమట్టమయిందని వ్యాఖ్యానించారు. తన అన్ని మేకపాటి రాజమోహన్ రెడ్డి వల్లే తాను వైసీపీ నుంచి సస్పెండ్ అయ్యానని చెప్పారు. నెల్లూరు జిల్లా మర్రిపాడులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు నిన్న ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు జైలు నుంచి విడుదలైన తర్వాత తాను టీడీపీలో చేరుతానని చెప్పారు.

More Telugu News