Viral Video: ముంబై మెట్రోలో ఐటమ్ సాంగ్ తో రెచ్చిపోయిన యువతి.. పోలీసుల సీరియస్

Viral Video Shows Woman Flaunt Belly Dance Moves In Mumbai Local Draws Criticism From Netizens
  • కొంత మేర శరీర ప్రదర్శన చేస్తూ బెల్లీ డ్యాన్స్ చేసిన యువతి
  • లోకల్ రైళ్లు సంతోషకర కేంద్రాలుగా మారాయంటున్న నెటిజన్లు
  • వీటికి అడ్డుకట్ట వేయాలని, అరెస్ట్ చేయాలని కొందరి డిమాండ్
ఓ యువతి వంటిపై పూర్తి స్థాయిలో ఆచ్ఛాదన లేకుండా రెచ్చిపోయి మరీ ముంబై మెట్రో రైలులో బెల్లీ డ్యాన్స్ చేసింది. ఇది కొందరికి వినోదాన్ని పంచితే.. కొందరికి అసౌకర్యాన్ని కల్పించింది. సాధారణంగా ఢిల్లీ మెట్రో ఈ తరహా కార్యకలాపాలకు ప్రసిద్ధి. డ్యాన్స్ చేస్తూ,  వీడియో తీసుకుని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ ఉంటారు. ఢిల్లీ మెట్రోలో బహిరంగ శృంగారానికి సంబంధించిన ఘటనలు కూడా వెలుగు చూస్తుంటాయి. ఢిల్లీ మెట్రోలోని ఘటనల స్పూర్తితో ముంబై యువత కూడా స్థానిక మెట్రోను కేంద్రంగా చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.

శాండ్ హర్ట్స్ రోడ్, మస్జీద్ స్టేషన్ల మధ్య మెట్రో రైలులో యువతి నృత్యం చేస్తున్న వీడియో క్లిప్ ట్విట్టర్ లోకి చేరడంలో వైరల్ గా మారిపోయింది.  ముంబై లోకల్ ట్రైన్లు సంతోషకర కేంద్రాలుగా మారుతున్నాయంటూ కొందరు యూజర్లు సానుకూలంగా కామెంట్లు చేస్తున్నారు. దయచేసి రైళ్లలో ఈ బెల్లీ డ్యాన్స్ లను నిలిపివేయించాలంటూ ఓ యూజర్ కామెంట్ పెట్టాడు. ‘‘ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలి. అప్పుడు అది ఇతరులకు బలమైన సందేశాన్ని పంపించినట్టు అవుతుంది. మరోసారి ఎవరూ కూడా దీన్ని చేయడానికి సాహసం చేయరు. తమ ట్యాలెంట్ చూపించుకోవడానికి ఎన్నో ఛానళ్లు ఉన్నాయి’’అంటూ మరో యూజర్ కామెంట్ పెట్టారు. 

అదృష్టం కొద్దీ ముంబై రైళ్లలో డ్యాన్స్ చేయడానికి వీలుగా తగినంత స్థలం ఉందంటూ మరో యూజర్ హాస్యాస్పందంగా స్పందించారు. కాకపోతే ఎక్కువ మంది యూజర్లు దీనిపై సీరియస్ గానే స్పందిస్తున్నారు. ముంబై పోలీసులు కూడా స్పందిస్తూ, చర్యలు తీసుకోవాలని రైల్వే పోలీసులను కోరారు.
Viral Video
Woman
Belly Dance
Mumbai Local train
Criticism

More Telugu News