Chandrayaan-3: మరో రెండు రోజుల్లో చంద్రుడిపై సూర్యోదయం.. చంద్రయాన్-3 మేల్కొంటుందా?

  • చంద్రుడి నుంచి విలువైన సమాచారాన్ని పంపిన చంద్రయాన్-3
  • ప్రస్తుతం నిద్రాణ స్థితిలో ఉన్న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్
  • 22 నుంచి చంద్రుడి దక్షిణ ధ్రువంపై మళ్లీ పగలు ప్రారంభం
  • సూర్యకాంతి పడగానే మళ్లీ వాటిని మేల్కొలిపేందుకు ప్రయత్నిస్తామన్న ఇస్రో శాస్త్రవేత్తలు
Day Light Starts From 22nd On Moon Will Chandrayaan 3 Works Again

చంద్రయాన్-3 వైపు ప్రపంచం మరోమారు ఆసక్తిగా చూస్తోంది. చంద్రుడిపై ప్రస్తుతం నిద్రాణస్థితిలో ఉన్న ప్రజ్ఞాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్ మళ్లీ మేల్కొని ప్రయోగాలు కొనసాగిస్తాయా? అన్నదానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. చంద్రుడిపై విజయవంతంగా దిగిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ రెండూ అప్పగించిన పనులు పూర్తిచేశాయి. చంద్రుడికి సంబంధించి విలువైన సమాచారాన్ని అందించాయి. అనంతరం అక్కడ రాత్రి సమయం ప్రారంభం కావడంతో శాస్త్రవేత్తలు వాటిని స్లీప్‌మోడ్‌లోకి పంపించారు.

ఈ నెల 22న చంద్రుడి దక్షిణ ధ్రువంపై మళ్లీ సూర్యోదయం కాబోతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు అక్కడున్న మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతను అనుభవించిన విక్రమ్, ప్రజ్ఞాన్ రెండూ సూర్యకాంతి పడగానే మళ్లీ మేల్కొంటాయా? అన్నదానిపై ఇస్రో శాస్త్రవేత్తల్లో ఆసక్తి నెలకొంది. వాటిని మేల్కొలిపేందుకు ప్రయత్నిస్తామని శాస్త్రవేత్తలు తెలిపారు. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ రెండూ మళ్లీ పనిచేయడం ప్రారంభిస్తే మరో 14 రోజులు వాటి సేవలు అందుబాటులోకి వస్తాయి. అదే జరిగితే ఇస్రోకు అది బోనస్ అవుతుంది.

More Telugu News