YS Jagan: మహిళా రిజర్వేషన్ బిల్లుపై స్పందించిన ఏపీ సీఎం వైఎస్ జగన్

I am proud to extend YSRC Partys support to the Women Reservation Bill says ys jagan
  • మహిళా సాధికారత చాలా ముఖ్యమైన అంశమన్న ఏపీ సీఎం
  • ఏపీలో గత నాలుగేళ్లలో దీనిని సాధించామని వ్యాఖ్య
  • కలిసికట్టుగా.. ప్రకాశవంతమైన, సమాన భవిష్యత్తును సృష్టిద్దామని పిలుపు

లోక్ సభలో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. ఈ బిల్లుకు తాను మద్దతి ఇస్తున్నందుకు గర్విస్తున్నానంటూ సామాజిక అనుసంధాన వేదిక ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ట్వీట్ చేశారు. మహిళా సాధికారత చాలా ముఖ్యమైన అంశమని, ఆంధ్రప్రదేశ్‌లో గత నాలుగేళ్లలో ప్రవేశపెట్టిన పథకాలు, కార్యక్రమాల ద్వారా మాత్రమే కాకుండా, సమాన ప్రాతినిధ్యాన్ని నిర్ధారించడం ద్వారా కూడా దీనిని సాధించామని పేర్కొన్నారు. కలిసికట్టుగా... ప్రకాశవంతమైన, సమానమైన భవిష్యత్తును సృష్టిద్దామని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News