Prathipati Pulla Rao: పవన్ కల్యాణ్‌ను, లోకేశ్‌ను ఇబ్బందులకు గురి చేయాలనే: ప్రత్తిపాటి

Prathipati says government is trying to trouble pawan and lokesh
  • చంద్రబాబుపై బురద జల్లేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందన్న మాజీ మంత్రి
  • వచ్చే ఎన్నికల్లో వైసీపీకి భారీ ఓటమి తప్పదని హెచ్చరిక
  • పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రతిపక్షాలను అణచివేయాలని చూస్తోందని ఆరోపణ
తమ పార్టీ అధినేత చంద్రబాబుపై బురద జల్లేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి, టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను ఏదో విధంగా ఇబ్బందులకు గురిచేయాలని చూస్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి భారీ ఓటమి తప్పదని హెచ్చరించారు. చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ చిలకలూరిపేటలో ఏడో రోజు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ... రాష్ట్రంలో కొంతమంది ఉన్నతాధికారులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. చంద్రబాబుకు మద్దతుగా దేశవిదేశాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయని, మహిళలు, యువత సహా ప్రజలంతా రోడ్ల పైకి వస్తున్నారన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రతిపక్షాలను అణచివేయాలని అధికార పార్టీ చూస్తోందన్నారు.
Prathipati Pulla Rao
YS Jagan
Pawan Kalyan
Chandrababu
Nara Lokesh

More Telugu News