Botsa Satyanarayana: మహిళా రిజర్వేషన్ బిల్లును స్వాగతించిన వైసీపీ!

YSRCP Botsa welcomes women reservation bill
  • మహిళా రిజర్వేషన్ బిల్లు డిమాండ్ ఎప్పటి నుంచో ఉందన్న బొత్స
  • ఈ బిల్లుకు అన్ని పార్టీల మద్దతు ఉంటుందని ఆశాభావం
  • మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టిన కేంద్రం
మహిళా రిజర్వేషన్ బిల్లును వైసీపీ స్వాగతించింది! మహిళా రిజర్వేషన్ బిల్లు డిమాండ్ ఎప్పటి నుంచో ఉందని ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ బిల్లుకు అన్ని పార్టీల మద్దతు ఉందన్నారు. కాగా, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ బిల్లు మంగళవారం లోక్ సభ ముందుకు వచ్చింది. రేపు దీనిపై చర్చ ఉండనుంది.

రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ దిగువ సభలో ప్రవేశపెట్టారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు నారీ శక్తి వందన్ అభియాన్ అని పేరు పెట్టారు. ఈ బిల్లును ప్రవేశ పెట్టిన అనంతరం లోక్ సభ బుధవారానికి వాయిదా పడింది. రేపు చర్చ అనంతరం, ఓటింగ్ నిర్వహించి బిల్లుకు ఆమోదం తెలపనున్నారు. ఈ బిల్లును రాజ్యసభలో 21న ప్రవేశపెడతారు. కొత్త పార్లమెంట్ భవనంలో ప్రవేశపెట్టిన తొలి బిల్లు ఇది.
Botsa Satyanarayana
YSRCP
women reservation bill

More Telugu News