Asaduddin Owaisi: తెలంగాణలో ముస్లింలు సేఫ్ గా ఉన్నారు: ఒవైసీ

  • కర్ణాటకలో బీజేపీ హయాంలో దారుణ పరిస్థితులు ఉన్నాయన్న ఒవైసీ
  • తెలంగాణలో అటువంటి పరిస్థితులు లేవని వెల్లడి
  • కేసీఆర్ పాలనలో శాంతిభద్రతలు మెరుగ్గా ఉన్నాయని కితాబు
  • కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ కు నాయకత్వం వహించాలన్న ఎంఐఎం అధినేత
Asaduddin Owaisi says Muslims in Telangana are in safe hands

ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ముస్లింలు సురక్షితంగా ఉన్నారని స్పష్టం చేశారు. కర్ణాటకలో బీజేపీ అధికార పీఠంపై ఉన్నప్పుడు దారుణ పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. కర్ణాటకతో పోల్చితే తెలంగాణలో పరిస్థితి చాలా మెరుగ్గా ఉందని అన్నారు. సీఎం కేసీఆర్ సుపరిపాలనలో శాంతిభద్రతలకు లోటు లేదని, రాష్ట్రంలో ఎటువంటి దాడి ఘటనలు లేవని అన్నారు.

ఇక, థర్డ్ ఫ్రంట్ కు కేసీఆర్ నాయకత్వం వహిస్తే బాగుంటుందని ఒవైసీ అభిప్రాయపడ్డారు. దేశంలో థర్డ్ ఫ్రంట్ అధికారంలోకి వచ్చేందుకు గట్టి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కేసీఆర్, మాయావతి ఏ కూటమిలో లేరని స్పష్టం చేశారు. 

తెలంగాణలో బీజేపీ బండికి పంక్చర్ అయిందని, కాస్తో కూస్తో ఉన్న గాలిని ప్రజలు పూర్తిగా తీసేశారని ఒవైసీ వ్యంగ్యం ప్రదర్శించారు. దళితులు, ఓబీసీల రిజర్వేషన్లు పెంచాలంటున్న కాంగ్రెస్ పార్టీ... ముస్లిం రిజర్వేషన్లపైనా తన అభిప్రాయం చెబితే బాగుంటుందని ఒవైసీ పేర్కొన్నారు.

More Telugu News