Botsa Satyanarayana: చంద్రబాబు భద్రత పూర్తి బాధ్యత మాదే: బొత్స

Our govt will take total responsibility of Chandrababu security says Botsa
  • రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు భద్రతపై కుటుంబ సభ్యుల ఆందోళన
  • కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తున్నామన్న బొత్స
  • ఏదైనా లోపం ఉంటే తాము బాధ్యత తీసుకుంటామని వ్యాఖ్య
రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు భద్రతపై ఆయన కుటుంబం, టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ... చంద్రబాబుకు కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తున్నామని చెప్పారు. జైల్లో ఆయనకు కల్పిస్తున్న భద్రతకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తుందని అన్నారు. భద్రతలో ఏదైనా లోపం ఉంటే తాము పూర్తి బాధ్యతను తీసుకుంటామని చెప్పారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తన ప్రమేయం లేదని చంద్రబాబు నిరూపించుకోవాలని... అనవసరంగా ప్రభుత్వంపై ఆరోపణలు చేయొద్దని అన్నారు. పార్లమెంటులో ప్రవేశ పెట్టబోయే మహిళా రిజర్వేషన్ బిల్లుపై మాట్లాడుతూ... ఆ బిల్లుకు వైసీపీ పూర్తి మద్దతు ఇస్తుందని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం స్థానాలను కేటాయించిన ఘనత తమదని అన్నారు. 

Botsa Satyanarayana
YSRCP
Chandrababu
Telugudesam
Secutiry

More Telugu News