RBI: ఆర్బీఐలో అసిస్టెంట్ ఉద్యోగాలు.. భర్తీ ఎలా చేస్తారంటే..!

  • దేశవ్యాప్తంగా మొత్తం 450 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
  • డిగ్రీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన ఆర్బీఐ
  • అక్టోబర్ 4 తో ముగియనున్న దరఖాస్తు గడువు
RBI Recruitment 2023 RBI Invites Applications For Assistant Posts

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) లో అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఆర్బీఐ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉండగా.. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో బ్రాంచ్ లు ఉన్నాయి. ఆయా శాఖల్లోని ఖాళీలను భర్తి చేసేందుకు డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. కనీసం 50 శాతం మార్కులతో ఏదేనీ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అక్టోబర్ 4 వ తేదీలోగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

మొత్తం 450 అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆర్బీఐ ఈ నోటిఫికేషన్ లో తెలిపింది. కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీతో పాటు అభ్యర్థులకు కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరిగా ఉండాలని పేర్కొంది. అభ్యర్థులకు తాము దరఖాస్తు చేసుకునే రాష్ట్రంలో స్థానిక భాషలో రాయడం, చదవడం, మాట్లాడడం తప్పనిసరిగా తెలిసి ఉండాలి. మూడు రాత పరీక్షల (ప్రిలిమినరీ, మెయిన్, లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్) తో పాటు మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత తుది ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు చేసుకోవడం ఇలా..
ఆన్ లైన్ లో దరఖాస్తు చేసి, హార్డ్ కాపీని రీజనల్ ఆఫీసుకు పంపించాలి. రూ.450 ఫీజు చెల్లించి, సంస్థ వెబ్ సైట్ లోకి లాగిన్ అయి అప్లికేషన్లు సమర్పించాలి. వెనకబడిన కులాలు, దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు రూ.50.. ప్రిలిమినరీ పరీక్షను అక్టోబర్‌ 21 నుంచి అక్టోబర్‌ 23 వరకు నిర్వహించనున్నారు. డిసెంబర్ 02న ఆన్ లైన్ ఎగ్జామ్ నిర్వహిస్తారు.

దరఖాస్తులు పంపించాల్సిన చిరునామా..
రీజినల్ డైరెక్టర్ (హెచ్ఆర్), రిక్రూట్‌మెంట్ విభాగం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ముంబై రీజనల్ ఆఫీస్, షాహిద్ భగత్ సింగ్ రోడ్డు, ఫోర్ట్, ముంబై చిరునామాకు పంపాలి.

More Telugu News