K Kavitha: ఇది దేశంలోని ప్రతి ఒక్క మహిళ విజయం: ఎమ్మెల్సీ కవిత

  • మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోవడంపై హర్షం
  • ఎలాంటి అడ్డంకి లేకుండా లోక్‌సభలో సాఫీగా ఆమోదం పొందాలని ఆకాంక్ష
  • ఇది దేశ ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందన్న కవిత
MLC Kavita elates over introduce of Women Reservation Bill in parliament

మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హర్షం వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోవడం దేశంలోని ప్రతి ఒక్క మహిళ సాధించిన అద్భుత విజయం అన్నారు. లోక్‌సభలో అధికార బీజేపీకి స్పష్టమైన మెజారిటీ ఉన్నందున ఈ బిల్లు ఎలాంటి ఆమోదం ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా సాగాలని ఆకాంక్షించారు.

‘మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోతున్నందున ఇది మన దేశంలోని ప్రతి ఒక్క మహిళ సాధించిన ముఖ్యమైన విజయం. ఈ సందర్భంగా మన దేశ పౌరులందరికీ  నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. లోక్‌సభలో అధికార పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉన్నందున ఈ బిల్లు ఆమోదం ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా జరగాలి. మహిళా రిజ్వేషన్ బిల్లు విషయంలో బీజేపీ తమ 2014, 2019 ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చింది. దీన్ని నిలబెట్టుకునేందుకు కేవలం రాజకీయ సంకల్పం ఒక్కటే సరిపోదు. ఏదేమైనా ఇప్పుడు దేశంలోని మహిళలు రాజకీయాల్లో కేంద్ర దశకు చేరుకోవలసిన సమయం ఆసన్నమైంది. ఇది మన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో, ద్విగుణీకృతం చేయడంలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది’ అని కవిత ట్వీట్ చేశారు.

More Telugu News