డ్రగ్స్ కేసు.. హీరో నవదీప్ ఇంట్లో నార్కోటిక్స్ బ్యూరో సోదాలు
- టాలీవుడ్ ను కుదిపేస్తున్న డ్రగ్స్ వ్యవహారం
- ఈ నెల 16న నవదీప్ ఇంట్లో నార్కోటిక్స్ బ్యూరో సోదాలు
- ఆ సమయంలో ఇంట్లో లేని నవదీప్
ఈ క్రమంలో, ఈ నెల 16న హైదరాబాద్ లోని నవదీప్ ఇంట్లో నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు సోదాలు నిర్వహించిన విషయం వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో నవదీప్ ఇంట్లో లేడని సమాచారం. మరోవైపు తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని టీఎస్ హైకోర్టును నవదీప్ ఆశ్రయించిన సంగతి తెలిసిందే. నవదీప్ విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన హైకోర్టు... ఈరోజు వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. ఈ నేపథ్యంలో, ఈరోజు హైకోర్టులో నవదీప్ కు సంబంధించి నార్కోటిక్ బ్యూరో కౌంటర్ దాఖలు చేయనుంది.