Tirupati: తిరుపతి జిల్లాలో కలుషిత ప్రసాదం తినడంతో 50 మందికి అస్వస్థత

Villagers fell ill after consume contaminated food
  • కేబీపురం మండలం ఆరె గ్రామంలో ఘటన
  • రెండ్రోజుల క్రితం స్థానిక ఆలయంలో పూజలు
  • అనంతరం గ్రామస్థులకు ప్రసాదం పంపిణీ
  •  వాంతులు, విరేచనాలతో బాధపడిన గ్రామస్థులు
  • వైద్య శిబిరం ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్న వైద్యాధికారులు
తిరుపతి జిల్లాలో కలుషిత ఆహారం తినడంతో 50కిపైగా మంది అస్వస్థతకు గురయ్యారు. కేబీపురం మండలం ఆరె గ్రామంలో రెండు రోజుల క్రితం ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ప్రసాదాన్ని నిర్వాహకులు గ్రామస్థులకు పంపిణీ చేశారు.

ప్రసాదం తిన్న గ్రామస్థులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడ్డారు. వెంటనే అప్రమత్తమైన వైద్యాధికారులు గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేసి బాధితులకు చికిత్స అందిస్తున్నారు. కొందరు ఇప్పటికే డిశ్చార్జ్ కాగా, ఇంకా 30 మందికిపైగా చికిత్స పొందుతున్నారు. ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Tirupati
Contaminated Food
Andhra Pradesh

More Telugu News