Aditya L1: సూర్యుడి దిశగా పయనమైన ఆదిత్య ఎల్-1.. విజయవంతంగా కక్ష్య పెంపు

  • సూర్యుడి రహస్యాల ఛేదనకు బయలుదేరిన ఆదిత్య ఎల్-1
  • ఐదోసారి విజయవంతంగా కక్ష్య పెంచిన శాస్త్రవేత్తలు
  • ట్రాన్స్ లగ్రేంజియన్ పాయింట్-1లో ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టిన ఇస్రో
Aditya L1 bids goodbye to Earth forever

సూర్యుడి రహస్యాలు ఛేదించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్-1 లక్ష్యం దిశగా పయనమైంది. ఇప్పటికే దాని కక్ష్యను నాలుగుసార్లు పెంచిన శాస్త్రవేత్తలు తాజాగా ఐదోసారి పెంచి సూర్యుడి ట్రాన్స్ లగ్రేంజియన్ పాయింట్-1 దిశగా ప్రవేశపెట్టారు. ఈ ప్రయోగం విజయవంతమైనట్టు ఇస్రో తెలిపింది. 

ఇప్పటి నుంచి ఉపగ్రహం 110 రోజులు ప్రయాణించి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని ఎన్-1 పాయింట్‌కు చేరుకుంటుంది. ఆ తర్వాత శాస్త్రవేత్తలు మరోమారు విన్యాసం చేపట్టి ఎల్-1 కక్ష్యలో ప్రవేశపెడతారు. సూర్యుడి ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, కొరోనా వంటివాటి పరిశోధనకు సెప్టెంబర్ 2న ఇస్రో ఆదిత్య ఎల్-1 మిషన్‌ను చేపట్టింది. ఇది భారతదేశపు మొట్టమొదటి స్పేస్ ఆధారిత సోలార్ అబ్జర్వేటరీ మిషన్.

More Telugu News