vaiko: ఓ టెర్రరిస్ట్‌లా చంద్రబాబు అరెస్ట్... అందుకు జగన్ సంతోషించవచ్చు... కానీ...! వైగో

arrest of chandrababu like a terrorist is condemnable vaiko
  • చంద్రబాబు అరెస్ట్ రాజకీయ ప్రతీకారచర్య అన్న వైగో
  • సమన్లు జారీ చేసి, విచారణ చేయవచ్చునని వ్యాఖ్య
  • చంద్రబాబు అన్నింటినీ అధిగమించి బయటకు వస్తారని ఆశాభావం
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అరెస్ట్‌పై ఎండీఎంకే నేత వైగో తీవ్రంగా స్పందించారు. టీడీపీ అధినేత అరెస్ట్‌ను ఆయన ఖండించారు. చంద్రబాబు అరెస్ట్ రాజకీయ ప్రతీకార చర్య అన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సమన్లు జారీ చేసి, విచారణ జరపవచ్చునని చెప్పారు. కానీ అలా చేయకుండా నేరుగా అరెస్ట్ చేయడం సరికాదన్నారు. ఓ మాజీ ముఖ్యమంత్రిని తీవ్రవాదిలా అరెస్ట్ చేయడం దారుణమన్నారు.

టీడీపీ అధినేత అరెస్ట్ వైసీపీ ప్రతీకార చర్యకు నిదర్శనమన్నారు. రాజకీయ కారణాలతో ఆయనను అరెస్ట్ చేయడం పట్ల ముఖ్యమంత్రి జగన్ సంతోషించవచ్చునని, కానీ ఆ రాష్ట్ర ప్రజలకు ఆయన చేసిన సేవలను మాత్రం చెరిపివేయలేరన్నారు. చంద్రబాబు వీటన్నింటిని అధిగమించి తిరిగి బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
vaiko
Chandrababu
Tamilnadu
Andhra Pradesh
YS Jagan

More Telugu News