Justice Abdul Nazeer: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్

  • కడుపునొప్పితో బాధపడుతున్న ఏపీ గవర్నర్
  • డాక్టర్లకు సమాచారం అందించిన రాజ్ భవన్ అధికారులు
  • పరీక్షలు చేసిన డాక్టర్లు... ఆసుపత్రిలో చేరాలని సూచన
  • తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రిలో చేరిన గవర్నర్
AP Governor hospitalized with illness

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అనారోగ్యం పాలయ్యారు. ఆయన కడుపు నొప్పితో బాధపడుతున్నారు. గవర్నర్ అస్వస్థతకు గురయ్యారని రాజ్ భవన్ వర్గాలు డాక్టర్లకు సమాచారం అందించాయి. విజయవాడలో డాక్టర్లు రాజ్ భవన్ కు వచ్చి గవర్నర్ అబ్దుల్  నజీర్ ను పరీక్షించారు. ఆయన ఆసుపత్రిలో చేరితే బాగుంటుందని సలహా ఇచ్చారు. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స జరుగుతోన్నట్టు తెలుస్తోంది.

More Telugu News