nagasushila: హీరో నాగార్జున సోదరి నాగసుశీలపై పోలీస్ కేసు నమోదు

Police case against Nagarjuna sister Nagasushila
  • నాగసుశీల సహా పన్నెండు మంది దాడి చేశారని చింతలపూడి శ్రీనివాస్ ఫిర్యాదు
  • కేసు నమోదు చేసిన మొయినాబాద్ పోలీసులు
  • వీరిద్దరు కలిసి గతంలో పలు సినిమాల నిర్మాణం... కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం
ప్రముఖ తెలుగు నటుడు నాగార్జున సోదరి నాగసుశీలపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. తమ శ్రీజ ప్రకృతి ధర్మ పీఠం ఆశ్రమంపై నాగసుశీలతో పాటు మరికొందరు దాడి చేశారని చింతలపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదయింది. నాగసుశీల, శ్రీనివాస్ కలిసి గతంలో పలు చిత్రాలను నిర్మించడంతో పాటు వ్యాపార భాగస్వాములుగా ఉన్నారు. వీరి మధ్య కొన్నేళ్లుగా భూవివాదం ఉంది. 

శ్రీనాగ్ ప్రొడక్షన్ మేనేజింగ్ పార్ట్‌నర్ చింతలపూడి శ్రీనివాస్, నాగసుశీల మధ్య కొన్నేళ్లుగా భూవివాదాలు ఉన్నాయి. ఇద్దరు కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. అయితే తనకు తెలియకుండానే శ్రీనివాస్ తన భూములను విక్రయించాడని గతంలో పంజాగుట్ట పోలీసులకు నాగసుశీల ఫిర్యాదు చేశారు. 

మరోవైపు తనను జైలుపాలు చేసైనా తన చేత కంపెనీ ఆస్తులు రాయించుకోవడానికి తనపై నాగసుశీల కేసు పెట్టారని శ్రీనివాస్ ఆరోపించారు. నాగసుశీల తనయుడు సుశాంత్‌తో నాలుగు సినిమాలు తీసి భారీగా నష్టపోయామన్నారు. ఈ వివాదాల నేపథ్యంలో నాగసుశీలపై శ్రీనివాస్ ఫిర్యాదు చేశారని తెలుస్తోంది.
nagasushila
Nagarjuna
Police
Tollywood

More Telugu News