Telugu: ఏపీ అనే పిలుస్తున్నారు.. అక్కడ తెలుగును సముద్రంలో కలిపేశారు: గరికపాటి

Garikapati Narasimha rao about lack of encouragement for Telugu in Andhrapradesh
  • ఆంధ్రప్రదేశ్‌ను ప్రస్తుతం ఏపీ అని మాత్రమే పిలుస్తున్నారని విచారం
  • తెలుగు భాష పరిరక్షణలో తెలంగాణ కాస్తంత మెరుగ్గా ఉందని వెల్లడి
  • తెలంగాణను టీఎస్ అని పిలవకపోవడం సంతోషకరమన్న గరికపాటి
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు భాషను సమీపంలోని సముద్రంలో కలిపేశారని పద్మశ్రీ పురస్కార గ్రహీత, ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని ఏపీగా మాత్రమే పిలుచుకుంటున్నారని తెలిపారు. తెలుగు భాషా పరిరక్షణలో తెలంగాణ కాస్తంత మెరుగ్గానే ఉందని కూడా చెప్పారు. తెలంగాణను కూడా టీఎస్‌గా పిలుచుకునే పరిస్థితి ప్రస్తుతం లేకపోవడం సంతోషకరమని వ్యాఖ్యానించారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఆదివారం భగవద్గీత ప్రచార పరిషత్ ఏర్పాటు చేసిన ప్రవచన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Telugu
Garikapati Narashimha Rao
Andhra Pradesh
Telangana

More Telugu News