Rajinikanth: చంద్రబాబును కలవాలని అనుకున్నా.. కానీ..: రజనీకాంత్

I was about to meet Chandrababu says Rajinikanth
  • జైల్లో చంద్రబాబును రజనీ కలుస్తున్నారంటూ వార్తలు
  • ఫ్యామిలీ ఫంక్షన్ కారణంగా చంద్రబాబును కలవడం కుదరలేదన్న రజనీ
  • ఫంక్షన్ కోసం చెన్నై నుంచి కోయంబత్తూరుకు పయనం

టీడీపీ అధినేత చంద్రబాబును కలిసేందుకు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రానున్నారనే ప్రచారం జరగుతున్న సంగతి తెలిసిందే. సోమవారంనాడు చంద్రబాబును ములాఖత్ ద్వారా కలుస్తారనే వార్తలు వచ్చాయి. దీనిపై రజనీకాంత్ క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబును కలిసేందుకు తాను వెళ్దామనుకున్నానని... అయితే ఫ్యామిలీ ఫంక్షన్ వల్ల అది కుదరలేదని చెప్పారు. 

ఈరోజు రజనీకాంత్ చెన్నై నుంచి కోయంబత్తూరుకు బయల్దేరారు. ఫ్యామిలీ ఈవెంట్ లో పాల్గొనేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా చంద్రబాబును కలిసేందుకు ఎప్పుడు వెళ్తున్నారని ఆయనను మీడియా ప్రశ్నించింది. దీనికి సమాధానంగా ఫ్యామిలీ ఫంక్షన్ వల్ల వెళ్లడం కుదరలేదని చెప్పారు. 

  • Loading...

More Telugu News