Prime Minister: ఢిల్లీ మెట్రోలో కలియతిరిగిన ప్రధాని మోదీ

PM Modi inaugurates Delhi Airport Metro Express Line extension
  • ఢిల్లీ మెట్రోలైన్ ఎక్స్ టెన్షన్ కు ప్రారంభం
  • యశోభూమిని అనుసంధానించనున్న నూతన మార్గం
  • అనంతరం అదే మెట్రో రైలులో ప్రయాణం
  • ప్రయాణికులతో ఉత్సాహంగా మాట్లాడిన ప్రధాని
ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ ఎయిర్ పోర్ట్ మెట్రో లైన్ ఎక్స్ టెన్షన్ (పొడిగించిన మార్గం)ను ఆదివారం ప్రారంభించారు. ఈ పొడిగించిన మార్గం కొత్తగా ఏర్పాటు చేసిన యశోభూమి ద్వారక సెక్టార్ 21 మెట్రో స్టేషన్ ను అనుసంధానిస్తుంది. ప్రపంచంలోని అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్ అయిన యశోభూమిని ఈ మెట్రో లైన్ ద్వారా చేరుకోవచ్చు. 

ప్రారంభం తర్వాత అదే మెట్రో రైలులో ప్రధాని ప్రయాణించారు. తోటి ప్రయాణికులతో పలు అంశాలపై మాట్లాడి, వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. చిన్నారులను ప్రేమగా పలకరించారు. 73వ పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రధాని మోదీ చాలా ఉత్సాహంగా కనిపించారు. ప్రధాని కొత్తగా ప్రారంభించిన మెట్రో లైన్ ప్రయాణికుల సేవలు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమం అనంతరం ప్రధాని ద్వారకలో ఏర్పాటు చేసిన ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ అండ్ ఎక్స్ పో సెంటర్ (యశోభూమి) మొదటి దశను ప్రారంభిస్తారు. 
Prime Minister
Narendra Modi
inaugurates
Delhi Airport Metro Express Line
yashobhoomi

More Telugu News