పరేడ్ గ్రౌండ్స్‌లో వైభవంగా తెలంగాణ విమోచన దినోత్సవం
- కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆదివారం వైభవంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు
- ముఖ్య అతిథిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరు
- తొలుత వార్ మెమోరియల్ వద్ద అమర వీరులకు నివాళి
- అనంతరం, జాతీయ జెండా ఆవిష్కరణ
- నిజాంపై అలుపెరుగని పోరాటం అచంచల దేశభక్తికి నిదర్శమని అమిత్ షా వ్యాఖ్య
అనంతరం, అమిత్ షా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తరువాత, సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. నిజాంపై అలుపెరుగని పోరాటం అచంచల దేశభక్తికి నిదర్శనమని అమిత్ షా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ వేడుకల్లో అమిత్ షాతో పాటూ కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.