Humayun Bhat: నేను బతికే అవకాశం లేదు.. పిల్లాడిని జాగ్రత్తగా చూసుకో.. చనిపోవడానికి ముందు భార్యకు వీడియో కాల్ చేసి జాగ్రత్తలు చెప్పిన అనంత్‌నాగ్ హీరో

  • అనంత్‌నాగ్ జిల్లా కోకెర్‌నాగ్‌లోని గడోలే అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్
  • తీవ్రంగా గాయపడిన డీఎస్పీ హుమయూన్ భట్
  • చనిపోవడానికి ముందు కుటుంబ సభ్యులతో వీడియో కాల్
Take Care of our son says Anantnag hero cop Humayun Bhats last call to family

అనంతనాగ్ జిల్లా కోకెర్‌నాగ్ ప్రాంతంలోని గడోలే అటవీ ప్రాంతంలో పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అమరుడైన జమ్మూకశ్మీర్ డిప్యూటీ సూపరింటెండెంట్ హుమయూన్ భట్ చివరి క్షణాల్లో భార్యతో మాట్లాడిన మాటలు కన్నీరు పెట్టిస్తున్నాయి. ఎన్‌కౌంటర్‌లో తీవ్రంగా గాయపడిన ఆయన ప్రాణాలు విడిచిపెట్టడానికి ముందు కుటుంబ సభ్యులతో వీడియో కాల్‌లో మాట్లాడారు. తన నెల వయసున్న కుమారుడిని చూడాలని ఆరాటపడ్డారు. 

భార్య ఫాతిమాకు ఫోన్ చేసిన భట్.. ‘‘నేను బతికే అవకాశం లేదు. నేను కనుక చనిపోతే బాబును జాగ్రత్తగా చూసుకో’’ అని ఆ వీడియో కాల్‌లో భార్యకు జాగ్రత్తలు చెప్పారు. మరో 15 రోజుల్లో వారు వివాహ వార్షికోత్సవం జరుపుకోవాల్సి ఉంది. అంతలోనే ఈ ఘటన జరగడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.  

ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌లో అమరుడైన డీఎస్పీ హుమయూన్ భట్‌కు ఆయన స్వగ్రామమైన బుద్గాంలోని హుమ్‌హమాలో బుధవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల్లో స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పాక్ వ్యతిరేక నినాదాలు చేశారు.

More Telugu News