Chandrababu: చంద్రబాబుకు జైల్లో నిద్ర లేకుండా చేస్తూ జగన్ సైకో ఆనందం పొందుతున్నాడు: దేవినేని ఉమా

Jagan is enjoying psycho pleasure by making Chandrababu sleepless in jail says Devineni Uma
  • చంద్రబాబు నిద్రపోకుండా తరచుగా శబ్దాలు చేయాలన్న ఆదేశాలు వెళ్లాయన్న ఉమా
  • విజిల్స్ వేయడం, జైలు ఊచలను లాఠీలతో కొట్టడం వంటివి చేస్తున్నారని మండిపాటు
  • అక్రమ అరెస్ట్ లతో పాలనను కొనసాగిస్తున్నారని విమర్శ
రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును సరిగా నిద్రపోకుండా చేస్తున్నారని టీడీపీ నేత దేవినేని ఉమా విమర్శించారు. చంద్రబాబు నిద్రపోకుండా తరచుగా శబ్దాలు చేయాలని జైలు సిబ్బందికి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లాయని... దీంతో జైలు సిబ్బంది విజిల్స్ వేయడం, జైలు ఊచలను లాఠీలతో కొట్టడం వంటివి చేస్తూ చంద్రబాబు నిద్రకు భంగం కలిగిస్తున్నారని చెప్పారు. నిద్ర లేకుండా బాధపడుతున్న చంద్రబాబును సీసీ కెమెరాలలో చూసి జగన్ సైకో ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. శుక్ర, శని, ఆదివారాలు వస్తే జగన్ నిద్రపోకుండా... ఎవరిని అరెస్ట్ చేద్దాం, ఎవరిని హింసిద్దాం అని ఆలోచిస్తుంటారని దుయ్యబట్టారు. జేసీబీ కూల్చివేతలతో పాలనను ప్రారంభించిన జగన్... ఇప్పుడు అక్రమ అరెస్ట్ లతో పాలనను కొనసాగిస్తున్నారని మండిపడ్డారు.
Chandrababu
Telugudesam
Devineni Uma
Jagan
YSRCP

More Telugu News