MS Dhoni: ఓ కుర్ర క్రికెటర్ ను ఎక్కించుకుని బైక్ పై దూసుకెళ్లిన ధోనీ... వీడియో ఇదిగో!

  • రాంచీ స్టేడియంలో ధోనీ ప్రాక్టీస్
  • ప్రాక్టీస్ ముగిశాక ఓ యువ క్రికెటర్ కు బైక్ పై లిఫ్ట్ ఇచ్చిన వైనం
  • ధోనీ బైక్ నడుపుతుంటే వెనుక కూర్చుని వీడియో తీసిన టీనేజర్
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో 
Dhoni offers lift to a young cricketer on his sports bike

టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పి చాన్నాళ్లయినా ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. ధోనీ ఏంచేసినా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. తాజాగా, ఓ యువ క్రికెటర్ ను ఎక్కించుకుని ధోనీ బైక్ రైడింగ్ చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. రాంచీ స్టేడియంలో ప్రాక్టీసు ముగించుకున్న ధోనీ... అక్కడే ఉన్న ఓ యువ క్రికెటర్ కు బైక్ పై లిఫ్ట్ ఇచ్చాడు. స్పోర్ట్స్ బైక్... పైగా నడుపుతున్నది లెజెండ్ ధోనీ... ఇక ఆ కుర్ర క్రికెటర్ ఆనందానికి హద్దేముంటుంది చెప్పండి. బైక్ పై వెళుతున్నంత సేపు తన మొబైల్ తో చిత్రీకరించిన ఆ టీనేజర్ ఆ వీడియోను నెట్టింట పంచుకున్నాడు.

More Telugu News