Team India: ఆసియా కప్: నామమాత్రపు మ్యాచ్ లో భారత్, బంగ్లాదేశ్ ఢీ

India elected bowling first against Bangladesh in Asia Cup
  • ఇప్పటికే ఆసియా కప్ ఫైనల్లోకి భారత్, శ్రీలంక
  • ఇవాళ్టి మ్యాచ్ కు ప్రాధాన్యం లేని వైనం
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
  • వన్డేల్లో అరంగేట్రం చేస్తున్న తిలక్ వర్మ
ఆసియా కప్ లో భారత్, శ్రీలంక జట్లు ఫైనల్ లో ప్రవేశించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగే సూపర్-4 చివరి మ్యాచ్ కు ప్రాధాన్యత లేకుండా పోయింది. నామమాత్రంగా మారిన ఈ పోరులో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గత కొన్నిరోజులుగా విపరీతంగా వర్షాలు కురుస్తున్న కొలంబో నగరంలోనే ఈ మ్యాచ్ కూడా జరగనుంది. 

కాగా, తెలుగుతేజం తిలక్ వర్మ ఈ మ్యాచ్ ద్వారా వన్డే క్రికెట్లో అరంగేట్రం చేస్తున్నాడు. ఎల్లుండి (సెప్టెంబరు 17) జరిగే ఫైనల్ ను దృష్టిలో ఉంచుకుని ఈ మ్యాచ్ నుంచి విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ లకు విశ్రాంతి కల్పించారు. షమీ, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్, సూర్యకుమార్ యాదవ్ జట్టులోకి వచ్చారు.
Team India
Bangladesh
Toss
Bowling
Asia Cup

More Telugu News