Chandrababu: చంద్రబాబు అరెస్టులో కీలక పరిణామం.. కేంద్ర హోంశాఖకు ఎన్ఎస్జీ నివేదిక

  • అరెస్టు నుంచి జైలుకు తరలించే వరకు పరిణామాలతో నివేదిక
  • రూపొందించిన బాబు భద్రతను చూస్తున్న ఎన్ఎస్జీ సిబ్బంది 
  • ఎన్ఎస్జీ ప్రధాన కార్యాలయానికి కూడా నివేదిక అందజేత
NSG Reports about CBN arrest and other incidents to Union Home Ministry

స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు విషయలో కీలక పరిణామం చేసుకుంది. ఈ కేసులో బాబు, అరెస్ట్, జైలుకు వెళ్లడం సహా ఇతర పరిణామాలపై కేంద్ర హోంశాఖకు ఆయన భద్రతను పర్యవేక్షిస్తున్న జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఎస్జీ) నివేదిక అందించింది. ఈ నెల 8న అరెస్టయిన బాబుకు ఏసీబీ కోర్టు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో బాబు ప్రస్తుతం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్నారు. 8వ తేదీ అర్ధరాత్రి నుంచి 10 తేదీ అర్ధరాత్రి 1 గంట వరకు జరిగిన అరెస్టు, ఏసీబీ కోర్టు రిమాండ్, రాజమహేంద్రవరం జైల్లో బాబుకు కల్పిస్తున్న భద్రత తదితర అంశాలను నివేదికలో ఎన్ఎస్జీ పేర్కొంది. 

తొమ్మిదో తేదీ ఉదయం 6 గంటలకు సీఐడీ అరెస్టుతో పాటు ఎన్ఎస్జీ కమాండోల భద్రతలో ఉన్న బాబు రోడ్డు మార్గంలో విజయవాడకు తరలింపు అంశాన్ని కూడా ఇందులో ప్రస్తావించింది. 10 తేదీన విచారణ సందర్భంగా భద్రతా పరంగా అంత పటిష్ఠంగా లేని కోర్టు హాలు వెలుపల ఆయనను ఉంచినట్లు పేర్కొంది. సెంట్రల్ జైల్లో ప్రస్తుతం అయన భద్రత ఏమిటన్న విషయంతో పాటు జైలు అవరణలోకి వెళ్ళే సమయంలో కొన్ని భద్రతా లోపాలు గుర్తించినట్టు తమ నివేదికలో ఎన్ఎస్జీ పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఈ మొత్తం నివేదికను ఎన్ఎస్జీ ప్రధాన కార్యాలయానికి సమర్పించింది.

More Telugu News