విష జ్వరంతో 16 ఏళ్ల బాలిక మృతి
- పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో ఘటన
- హనుమకొండ జిల్లా మడికొండలోని గురుకులంలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న బాలిక
- వారం రోజులుగా వస్తూ పోతున్న జ్వరం
- జమ్మికుంట ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే మృతి
అశ్వితకు వారం రోజులుగా జ్వరం వస్తూ పోతుండడంతో కుటుంబ సభ్యులు శనివారం పాఠశాలకు వచ్చి ఇంటికి తీసుకెళ్లారు. కుమార్తెకు మళ్లీ తీవ్ర జ్వరం రావడంతో నిన్న జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది. విషజ్వరంతో బాలిక మృతి చెందడం గ్రామంలో విషాదం నింపింది.