Nara Lokesh: రాజమండ్రి నుంచి ఢిల్లీ బయలుదేరిన నారా లోకేశ్ 

Nara Lokesh off to Delhi
  • ఢిల్లీలో జాతీయ మీడియాతో మాట్లాడనున్న లోకేశ్
  • చంద్రబాబు కేసుపై సుప్రీంకోర్టు న్యాయవాదులతో చర్చ
  • పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై టీడీపీ ఎంపీలతో సమావేశం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రాజమండ్రి నుంచి ఢిల్లీ బయల్దేరారు. ఆయన వెంట టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా ఉన్నారు. ఢిల్లీలో నారా లోకేశ్ జాతీయ మీడియాతో మాట్లాడనున్నారు. ఏపీలో నెలకొన్న పరిస్థితులను జాతీయ స్థాయిలో వివరించనున్నారు. చంద్రబాబు కేసు విషయమై సుప్రీంకోర్టు న్యాయవాదులతో చర్చించనున్నారు. 

కాగా, పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో... లోక్ సభ, రాజ్యసభలోనూ ఏపీ పరిస్థితులు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించేలా టీడీపీ వ్యూహరచన చేస్తోంది. చంద్రబాబు అరెస్ట్ పై లోక్ సభలో చర్చ కోసం లోకేశ్ టీడీపీ ఎంపీలతో మాట్లాడనున్నారు.
Nara Lokesh
New Delhi
Chandrababu
Arrest
TDP
Andhra Pradesh

More Telugu News