K Kavitha: ఈడీ నోటీసులపై పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు: ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha on ED notices
  • తనకు నోటీసులు వచ్చాయని, న్యాయసలహా తీసుకుంటున్నట్లు చెప్పిన కవిత
  • రాజకీయ కక్షతో వచ్చిన నోటీసులు కాబట్టి అంతగా స్పందించాల్సిన అవసరం లేదని వెల్లడి
  • టీవీ సీరియల్‌లా లాగుతున్నారని కవిత వ్యాఖ్య
తనకు జారీ అయిన ఈడీ నోటీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ... తనకు నోటీసులు వచ్చాయని, న్యాయసలహా తీసుకుంటున్నామని ఆమె తెలిపారు. రాజకీయ దురుద్ధేశ్యంతోనే తనకు నోటీసులు వచ్చాయన్నారు. ఇవి రాజకీయ కక్షతో వచ్చిన నోటీసులు కాబట్టి అంతగా స్పందించాల్సిన అవసరం లేదని, పెద్దగా ఆలోచించాల్సిన అవసరమూ లేదన్నారు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్లీ కొత్త ఎపిసోడ్ వచ్చిందన్నారు.

సంవత్సరకాలంగా దీనిని టీవీ సీరియల్‌లా లాగుతున్నారని, కాబట్టి సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఇవి ఈడీ నోటీసులు కాదని, మోదీ నోటీసులు అన్నారు. ఈడీ నోటీసుల నేపథ్యంలో తాను రేపు విచారణకు హాజరు కావడం లేదన్నారు. సుప్రీంకోర్టులో విచారణ తర్వాతే హాజరవుతానని స్పష్టం చేశారు. ఈ ఎపిసోడ్ ఇంకెంత కాలం కొనసాగుతుందో చూడాలన్నారు. గతంలో 2జీ విచారణ చాలా కాలం సాగిందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలు కూడా దీనిని సీరియస్‌గా తీసుకోరన్నారు.
K Kavitha
ed
BRS

More Telugu News