ATM Center: ఏటీఎం పిన్ మర్చిపోతే ఇలా చేయండి..!

Follow This Simple Step To Reset New Debit Card PIN At ATM Center
  • ఏటిఎం సెంటర్ లోనే కొత్త పిన్ సెట్ చేసుకోవచ్చు
  • బ్యాంకు ఖాతా ఉన్న ఏటీఎం సెంటర్ లో పిన్ మార్చుకోవచ్చు
  • మీ ఖాతాతో అనుసంధానమైన ఫోన్ నెంబర్ కు సందేశం
నగదు తీసుకోవడానికి ఏటీఎం సెంటర్ కు వెళ్లాక కొన్ని కొన్ని సార్లు పిన్ నెంబర్ మర్చిపోతుంటాం.. మూడుసార్లు పిన్ తప్పుగా ఎంటర్ చేస్తే ఏటీఎం కార్డు 24 గంటల పాటు బ్లాక్ అవుతుంది. మోసాల నుంచి రక్షణ కోసం ఏర్పాటు చేసిన బ్యాంకు రూల్ ఇలాంటి సందర్భాలలో ఖాతాదారులను ఇబ్బంది పెడుతుంది. అయితే, పిన్ నెంబర్ మర్చిపోతే కంగారుపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. సింపుల్ గా మీ ఖాతా ఏ బ్యాంకులో ఉందో అదే బ్యాంకుకు చెందిన ఏటీఎంకు వెళితే ఈ సమస్యకు సులభంగా పరిష్కారం దొరుకుతుందని వివరించారు.

మీ బ్యాంకు ఏటీఎం సెంటర్ కు వెళ్లాక మెషిన్ లో కార్డు పెట్టి స్క్రీన్ పై కనిపించే ఆప్షన్లలో బ్యాంకింగ్ ఆప్షన్ ను ఎంచుకోవాలి. అందులో ఫర్ గెట్ పిన్ ఆప్షన్ సెలక్ట్ చేసి స్క్రీన్ పై కనిపించే సూచనలను ఫాలో కావాలి. బ్యాంకు ఖాతాతో లింక్ అయిన మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేశాక మీ మొబైల్ కు ఓటీపీ నెంబర్ వస్తుంది. దానిని ఏటీఎం మెషిన్ లో ఎంటర్ చేసి కొత్త పిన్ నెంబర్ సెట్ చేసుకోవచ్చు.

నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా పిన్ నెంబర్ మార్చుకోవచ్చు. బ్యాంకు అధికారిక వెబ్ సైట్ లోకి లాగిన్ అయ్యాక ఏటీఎం కార్డ్ ఆప్షన్స్ లోకి వెళ్లి పిన్ ఛేంజ్ ఆప్షన్ ను ఎంచుకోవాలి. ఆపై ఏటీఎం కార్డు సీవీవీ నెంబర్, కార్డు నెంబర్ లోని చివరి అంకెలు, కార్డు ఎక్స్ పైరీ ఇయర్ వివరాలను ఎంటర్ చేస్తే మొబైల్ కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ సాయంతో పిన్ నెంబర్ మార్చుకోవచ్చు.
ATM Center
Debit Card PIN
Reset Pin Number
Bank Account

More Telugu News