Rajanikanth: 'జైలర్' రికార్డులపైనే దృష్టి పెట్టిన 'లియో'

  • ఆగస్టు 10న విడుదలైన 'జైలర్'
  • 650 కోట్లకి పైగా వసూళ్లు
  • ఆ రికార్డుపై దృష్టి పెట్టిన విజయ్ ఫ్యాన్స్  
  • రీ షూట్ పనుల్లో ఉన్న 'లియో' టీమ్
Leo movie update

కోలీవుడ్ లో సీనియర్ స్టార్ హీరోల ట్రాక్ లో రజనీకాంత్ - కమల్ వసూళ్ల పరంగా తమ జోరు చూపిస్తూ వెళుతున్నారు. ఆ తరువాత వరుసలో విజయ్ - అజిత్ పోటీపడుతూ వెళుతున్నారు. అయితే ఒక సినిమా సంచలన విజయాన్ని సాధించిన తరువాత, ఆ తరువాత వస్తున్న తమ హీరో సినిమా అంతకు మించిన వసూళ్లను రాబట్టాలని అభిమానులు భావిస్తూ ఉంటారు. 

అదే పద్ధతి ఇప్పుడు 'జైలర్' విషయంలో కనిపిస్తోంది. రజనీకాంత్ కథానాయకుడిగా సన్ పిక్చర్స్ బ్యానర్లో 'జైలర్' సినిమా రూపొందింది. ఆగస్టు 10వ తేదీన విడుదలైన ఈ సినిమా 650 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. రజనీ ఛరిష్మా ఎంతమాత్రం తగ్గలేదనే విషయాన్ని ఈ సినిమా నిరూపించింది. ఆయన తరువాతనే ఎవరైనా అని ఫ్యాన్స్ చెప్పుకునేలా చేసింది. 

ఈ నేపథ్యంలో 'జైలర్' రికార్డులను 'లియో' అధిగమిస్తుందా? లేదా? అనేది ఇప్పుడు విజయ్ అభిమానులను వెంటాడుతున్న సందేహం. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఆల్రెడీ షూటింగు పార్టును పూర్తిచేసుకుంది. అయితే కొన్ని సీన్స్ విషయంలో ఆశించిన స్థాయి అవుట్ పుట్ రాలేదనే ఉద్దేశంతో, రీ షూట్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. 

More Telugu News