Chinta Mohan: చంద్రబాబు అరెస్ట్ వెనుక ఢిల్లీ పెద్దల హస్తం ఉంది: చింతా మోహన్

Delhi heads are behind Chandrababu says Chinta Mohan
  • స్కిల్ డెవలప్ మెంట్ అసలు స్కామే కాదన్న చింతా మోహన్
  • సుప్రీంకోర్టులో చంద్రబాబుకు న్యాయం జరుగుతుందని వ్యాఖ్య
  • జగన్ నవ్వుతూ ఇంటికి వెళ్లారని విమర్శ
ఢిల్లీ పెద్దల హస్తం లేకుండా టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ జరగదని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అన్నారు. చంద్రబాబు కచ్చితంగా తప్పు చేసి ఉండరని చెప్పారు. స్కిల్ డెవలప్ మెంట్ అనేది అసలు స్కామే కాదని అన్నారు. ఇలాంటి అక్రమ అరెస్టులు చేస్తే ముఖ్యమంత్రిగా ఎవరూ పని చేయరని చెప్పారు. చంద్రబాబును జైలుకు పంపించడం దారుణమని అన్నారు. ఏసీబీ కోర్టు తీర్పు సరిగా లేదని అభిప్రాయపడ్డారు. ఈ మధ్యకాలంలో జడ్జిమెంట్లు సరిగా ఉండటం లేదని విమర్శించారు. చంద్రబాబుకు రిమాండ్ విధించిన తీర్పులో లోటుపాట్లు ఉన్నాయని చెప్పారు. సుప్రీంకోర్టులో చంద్రబాబుకు న్యాయం జరుగుతుందని అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసు కోర్టులో నిలవదని చెప్పారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో వసతులు, రక్షణ సరిగా లేవని తెలిపారు. లండన్ నుంచి తిరిగి వచ్చాక జగన్ నవ్వుతూ ఇంటికి వెళ్లారని విమర్శించారు.
Chinta Mohan
Chandrababu
Telugudesam
Jagan
YSRCP

More Telugu News