Kangana Ranaut: ‘చంద్రముఖి 2’ నుంచి ‘తొరి బొరి’ సాంగ్ విడుదల!

  • కంగనా టైటిల్ రోల్ పోషించిన 'చంద్రముఖి 2'
  • 'వేట్టయ రాజా'గా కనిపించనున్న లారెన్స్
  • ప్రత్యేక ఆకర్షణగా కీరవాణి సంగీతం 
  • ఈ నెల 28వ తేదీన సినిమా విడుదల 
Chandramukhi 2 lyrical song released

స్టార్ కొరియోగ్రాఫర్ .. యాక్టర్ .. ప్రొడ్యూసర్ .. డైరెక్టర్ రాఘవ లారెన్స్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన భారీ బ‌డ్జెట్ మూవీ ‘చంద్రముఖి 2’. అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని సీనియ‌ర్ డైరెక్ట‌ర్ పి.వాసు రూపొందించారు. 

భారీ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమా తెలుగు .. త‌మిళ .. హిందీ .. కన్నడ ..  మలయాళ భాష‌ల్లో పాన్ ఇండియా మూవీగా సెప్టెంబ‌ర్  28న విడుదలవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ‘చంద్రముఖి 2’ చిత్రాన్ని రాధాకృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ ఉప్పుటూరి, వెంక‌ట ర‌త్నం శాఖ‌మూరి రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్‌గా రిలీజైన ‘చంద్రముఖి 2’ ట్రైలర్ సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్‌ను నెక్ట్స్ రేంజ్‌కి తీసుకెళ్లింది.

 ఓ వైపు హారర్, మరో వైపు కామెడీ ఎలిమెంట్స్‌తో 'చంద్రముఖి 2' అలరించనుందని ట్రైలర్‌లో స్పష్టమైంది. చంద్రముఖిగా కంగనా రనౌత్ మెప్పించనుండగా.. ఓ వైపు స్టైలిష్ లుక్, మరోవైపు వేట్టయ రాజాగా రాఘవ లారెన్స్ అలరించబోతున్నారు. వడివేలు తనదైన కామెడీతో మరోసారి నవ్వుల విందుని అందించబోతున్నట్టుగా అర్థమైంది.

తాజాగా చిత్రం నుంచి ఓ అందమైన పాటను రిలీజ్ చేశారు. 'తొరి బొరి' అంటూ రిలీజ్ చేసిన లిరికల్ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ పాటను భువనచంద్ర రాయగా.. అరుణ్ కౌండిన్య, అమల చెంబోలు ఆలపించారు. ఇక ఎం.ఎం. కీరవాణి వినసొంపైన బాణీ అందరినీ మెప్పిస్తోంది. ఈ పాటలో రాఘవ లారెన్స్, వడివేలు స్పెషల్ అట్రాక్షన్ అవుతున్నారు.

More Telugu News