Raghu Rama Krishna Raju: చంద్రబాబును పవన్ కల్యాణ్ కలవనుండడంపై రఘురామ స్పందన

  • స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకు రిమాండ్
  • రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా చంద్రబాబు
  • రేపు టీడీపీ అధినేతతో పవన్ కల్యాణ్ ములాఖత్
  • ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు అని అభివర్ణించిన రఘురామ
Raghu Rama Krishna Raju opines on Pawan Kalyan meeting Chandrababu tomorrow

జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ రేపు (సెప్టెంబరు 14) రాజమండ్రి సెంట్రల్ జైలులో టీడీపీ అధినేత చంద్రబాబును కలవనున్న సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయిన చంద్రబాబు రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనకు ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో, చంద్రబాబును కలిసేందుకు పవన్ కల్యాణ్ జైలు అధికారులకు ములాఖత్ దరఖాస్తు చేసుకున్నారు. 

దీనిపై వైసీపీ రెబల్  ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. రేపు రాజమండ్రి కేంద్ర కారాగారంలో చంద్రబాబును పవన్ కల్యాణ్ కలుస్తుండడం సంతోషదాయకమని పేర్కొన్నారు. ఏపీ రాజకీయాల్లో ఇది కీలక మలుపు అని రఘురామ అభివర్ణించారు. ఆపదలో అండగా నిలిచేవాడే స్నేహితుడు అని ఉద్ఘాటించారు.

More Telugu News