YV Subba Reddy: చంద్రబాబు ఇప్పటివరకు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వచ్చాడు: వైవీ సుబ్బారెడ్డి

YV Subbareddy talks about skill development case
  • స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్
  • చట్టం ముందు అందరూ సమానమేన్న వైవీ సుబ్బారెడ్డి
  • అన్ని అంశాలు పరిశీలించాకే చంద్రబాబుకు కోర్టు రిమాండ్ విధించిందని వెల్లడి
విపక్ష నేత చంద్రబాబు ఇప్పటివరకు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వచ్చాడని, 2014లో ఓటుకు నోటు కేసును కూడా అలాగే మేనేజ్ చేశాడని వైసీపీ అగ్రనేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చోటుచేసుకున్న పరిణామాలపై వైవీ ఇవాళ స్పందించారు. చట్టం ముందు అందరూ సమానమేనని స్పష్టం చేశారు. న్యాయస్థానం అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే చంద్రబాబుకు రిమాండ్ విధించిందని ఆయన స్పష్టం చేశారు. 

స్కిల్ డెవలప్ మెంట్ విషయంలోనే కాకుండా, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఏపీ ఫైబర్ నెట్ లోనూ దోపిడీ జరిగిందని ఆరోపించారు. 2014-19 మధ్య కాలంలో భారీగా అవినీతి జరిగిందని తెలిపారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
YV Subba Reddy
Chandrababu
Arrest
YSRCP
TDP

More Telugu News