Nara Lokesh: నారా లోకేశ్ ను కలిసి సంఘీభావం తెలిపిన విశాఖ జిల్లా జనసేన నేతలు

Visakha Janasena leaders met Nara Lokesh in Rajahmundry
  • స్కిల్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిన సీఐడీ
  • చంద్రబాబుకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్
  • రాజమండ్రిలో లోకేశ్ ను పరామర్శించిన విశాఖ జనసేన నేతలు
  • కృతజ్ఞతలు తెలిపిన లోకేశ్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు విశాఖ జిల్లా జనసేన నేతలు సంఘీభావం తెలిపారు. జనసేన రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్, చోడవరం ఇంచార్జ్ పి.ఎస్.ఎన్.రాజు, కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఇవాళ రాజమండ్రిలో లోకేశ్ ను కలిసి పరామర్శించారు. చంద్రబాబును తప్పుడు కేసులతోనే జైలుపాలు చేశారని మండిపడ్డారు. అక్రమ కేసులతో ప్రభుత్వం ప్రతిపక్షాలను ఇబ్బందులు పెడుతోందని అన్నారు. జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు ఛీత్కరించుకుంటున్నారని తెలిపారు. 

ఈ సందర్భంగా లోకేశ్ స్పందించారు. తనకు అండగా నిలుస్తున్న జనసేన నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీని రాష్ట్రం నుండి తరిమికొట్టేందుకు అంతా కలిసి పోరాడతామన్నారు.
Nara Lokesh
Janasena
Visakhapatnam
Chandrababu
Arrest
TDP

More Telugu News