The Vaccine War: ఇండియాలో తొలి బయో సైన్స్ చిత్రం.. 28న రానున్న ‘ది వ్యాక్సిన్ వార్’​

  • తెరకెక్కించిన ‘ది కశ్మీర్ ఫైల్స్’  దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి
  • కొవిడ్‌ వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు భారత శాస్త్రవేత్తల కష్టాన్ని చూపెట్టిన సినిమా
  • కీలక పాత్రలు పోషించిన నానా పటేకర్, పల్లవి జోషి, సప్తమి గౌడ
First bio science film in India The Vaccine War to release on September 28

‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రంతో గతేడాది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. అభిషేక్ అగర్వాల్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో ‘ది వ్యాక్సిన్‌ వార్‌‌’ అనే సినిమా వస్తోంది. భారతదేశంలోనే మొట్టమొదటి బయో సైన్స్ చిత్రం ఇదే కావడం విశేషం. నానా పటేకర్, పల్లవి జోషి, సప్తమి గౌడ శాస్త్రవేత్తలుగా నటించారు. రైమా సేన్ జర్నలిస్ట్‌గా కనిపించింది. ది కశ్మీర్ ఫైల్స్‌లో కీలక పాత్ర పోషించిన పల్లవి జోషి ఈ సినిమాకు సహ నిర్మాతగా కూడా ఉన్నారు. నిన్న విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచింది. 

కొవిడ్‌ వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు భారతీయ సైంటిస్టులు ఎదుర్కొన్న కష్టాలు, వాళ్ల త్యాగాలు, ప్రజల ప్రాణాలను కాపాడేందుకు తమ ప్రాణాలను పణంగా పెట్టిన విధానం ఇందులో చూపించారు. వ్యాక్సిన్ రీసెర్చ్ కోసం భారత శాస్త్రవేత్తల వద్ద కనీసం లక్ష రూపాయలు కూడా లేవు అనే డైలాగ్‌తో ట్రైలర్‌‌ మొదలైంది. ప్రజలు, మీడియా కూడా వాళ్లని నమ్మలేదు. ఇండియా వ్యాక్సిన్ తయారు చేయలేదన్న వ్యాఖ్యల నేపథ్యంలో  పెట్టుబడి, వనరులు, ప్రోత్సాహం లేకపోయినప్పటికీ వ్యాక్సిన్‌ కనుక్కోవడానికి సైనికుల మాదిరి ఎలా పోరాటం చేసి విజయం సాధించారో సినిమాలో చూపించనున్నారు. ఈ సినిమా ఈ నెల 28న సినిమా విడుదల కానుంది.

More Telugu News