Prabhas: 'సలార్' రిలీజ్ డేట్ వాయిదా ..ప్రకటించిన మేకర్స్!

  • ప్రభాస్ హీరోగా రూపొందుతున్న 'సలార్'
  • ఈ నెల 28వ తేదీన విడుదల కానున్న సినిమా 
  • క్వాలిటీ కోసం జరుగుతున్న కసరత్తు కారణంగా ఆలస్యం 
  • కొత్త విడుదల తేదీని త్వరలో చెబుతామన్న టీమ్
Salaar Movie Update

ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో 'సలార్' సినిమా రూపొందుతోంది. హోంబలే ఫిలిమ్స్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సంస్థతో కలిసి ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన 'కేజీఎఫ్' .. 'కేజీఎఫ్ 2' సినిమాలు సంచలన విజయాన్ని సాధించాయి. వసూళ్ల విషయంలో కొత్త రికార్డులను నమోదు చేశాయి. అదే బ్యానర్ లో ఇప్పుడు ఆయన 'సలార్' సినిమాను రూపొందిస్తున్నాడు. 

బొగ్గు గనుల నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది .. ప్రభాస్ ను ఆయన మాస్ యాక్షన్ హీరోగా ఈ సినిమాలో చూపించనున్నాడు. ఈ సినిమా నుంచి ఇంతవరకూ చాలా తక్కువ అప్ డేట్స్ వచ్చాయి. అయినా అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ఈ నెల 28వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా ఇంతకుముందే ప్రకటించారు. 

అయితే ఆ రోజున థియేటర్లకు ఈ సినిమా రావడం లేదు. కొన్ని కారణాల వలన ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. క్వాలిటీ విషయంలో రాజీ లేకుండా ఈ సినిమాను అందించే ప్రయత్నంలో ఆలస్యం అవుతోందనీ, అర్థం చేసుకోవాలని ఈ ప్రకటన ద్వారా  తెలియజేశారు. కొత్త విడుదల తేదీ ఎప్పుడు అనేది ఈ నెల 28లోగా తెలియజేయనున్నారు. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు కీలకమైన పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే.

More Telugu News