Bumrah: బుమ్రా డబుల్... కష్టాల్లో శ్రీలంక

Sri Lanka in troubles after Bumrah double
  • కొలంబోలో ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
  • 49.1 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌట్
  • లక్ష్యఛేదనలో 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన లంక

సొంతగడ్డపై 214 పరుగుల లక్ష్యం పెద్ద కష్టమేమీ కాదనుకున్న శ్రీలంకకు టీమిండియా పేసర్లు నిప్పులు చెరిగే బంతులతో స్వాగతం పలికారు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ చెలరేగడంతో లంక 8 ఓవర్లు ముగిసేసరికి కీలకమైన 3 వికెట్లు కోల్పోయింది. బుమ్రా 2 వికెట్లు తీయగా, సిరాజ్ 1 వికెట్ తీశాడు. 

ఆసియా కప్ సూపర్-4 దశలో జరుగుతున్న ఈ పోరులో టీమిండియా మొదట బ్యాటింగ్ చేసి 49.1 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం, బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంకను బుమ్రా, సిరాజ్ హడలెత్తించారు. 

ఓపెనర్ పత్తుమ్ నిస్సాంకను బుమ్రా అవుట్ చేయగా, మరో ఓపెనర్ దిముత్ కరుణరత్నేను సిరాజ్ వెనక్కిపంపాడు. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ కుశాల్ మెండిస్ వికెట్ కూడా బుమ్రాకే దక్కింది. ప్రస్తుతం శ్రీలంక 14 ఓవర్లలో 3 వికెట్లకు 52 పరుగులు చేసింది. సదీర సమరవిక్రమ 10, చరిత్ అసలంక 13 పరుగులతో ఆడుతున్నారు.

  • Loading...

More Telugu News